(తిమ్మాపూర్ జూలై 30)
తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాథ భూమయ్య (మనమరాలు )బిడ్డ కుమార్తె ఎడ్ల సౌమ్య (17) అనారోగ్య సమస్యలతో ఇటీవల మృతి చెందగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి వారి కుటుంబాన్ని పరామర్శించి, 50 కిలోల బియ్యన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, తుంగ శ్రీకాంత్, కాల్వ శ్రీనివాస్, కర్ర చందు, మామిడి అఖిల్ రాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.