తెలంగాణ విద్యా శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్.ఎల్.ఎన్ లో భాగంగా నిర్వహించిన తొగుట మండల టి.ఎల్.ఎమ్ మేళలో గణిత శాస్త్ర విభాగంలో యూ.పి.ఎస్ చందాపూర్ నుండి పాల్గొని మొదటి స్థానంలో నిలిచి తొగుట మండలం నుండి సిద్దిపేట జిల్లా స్థాయి టి.ఎల్.ఎమ్ మేళలో పాల్గొని గణితంలో అత్యుత్తమ టి.ఎల్.ఎమ్ ని ప్రదర్శించి, అందరి మన్ననలు పొంది, రాష్ట్ర స్థాయి టి.ఎల్.ఎమ్ మేళాకు యూ.పి. యస్ చందాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్దేశ్వర్ గారు ఎంపిక కావడం జరిగింది. అందుకు గాను చందాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీ బొడ్డు నర్సింలు గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసారు. రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శన కనబరచగలరని ఆకాంక్షించారు.
