ప్రాంతీయం

ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు

24 Views

రామగుండం కమీషనరేట్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి మోసలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు.

రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల ఫోటో, పేర్లతో ఫేక్ ఫేసుబుక్, వాట్సాప్, అకౌంట్‌ క్రియేట్ చేసి అందరి ఫ్రెండ్ రిక్వెస్ట్ లను అక్సెప్ట్ చేసి వారిని డబ్బులు అడగడం, అధికారి ఫ్రెండ్, బంధువులు ఆర్మీ అధికారి ట్రాన్స్ఫర్ కావడం వలన ఇంటికి సంబందించిన సామాన్లు తక్కువ ధరకు అమ్మడం జరుగుతుంది అని, పుట్టినరోజు సందర్బంగా బహుమతులు పంపించే విధంగా చాట్ చేయడం, పోలీస్ అధికారి ప్రొఫైల్ ఫోటో చూసి వారే చాట్ చేస్తున్నారో అని నమ్మి మోసపోవద్దు అని ఎవరూ కూడా అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటించారు. సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. కొంత కాలం క్రితం దీనికి సామాన్యులే బాధితులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రముఖులు, పోలీస్ అధికారుల పేరుమీద నకిలీ అకౌంట్లను తెరిచి వారే మాట్లాడుతున్నట్టు అవతల వారిని నమ్మించి డబ్బు అవసరం ఉన్నట్టు, తక్కువ ధరలో ఫర్నిచర్, ఇతర సామాన్లు పొందవచ్చు అని నమ్మించి సొత్తు కాజేచేస్తున్నారు. పోలీస్ అధికారి స్వయంగా చాట్ చేస్తున్నారనే భావన ఎదుటివారిలో కల్పిస్తున్నారు. పోలీస్ అధికారులు ఎవ్వరు కూడా తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్సెప్ట్ చేయడం, చాటింగ్ చేయడం జరగదు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రామగుండం సీపీ ప్రజలను సూచించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్