ప్రాంతీయం

రాష్ట్రస్థాయి పోటీలకు ప్రభుత్వ విద్యార్థుల ఎంపిక…

122 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి18 (24/7న్యూస్ ప్రతినిధి)  నామపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైనట్లు ఈనెల17న జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు బుస అఖిల్, యారపు అద్విక్, బేరుగు సింధు, చిట్టవేని స్పందన నలుగురు విద్యార్థులు సాఫ్ట్ బాల్ గేమ్ లో గొడుగు మానస ఖోఖో గేమ్ లో, పరికి వేణు షాట్ పుట్ లో, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి సీఎంకప్ రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైనట్లు పిడి కుంట శ్రీనివాస్ తెలిపారు.ఈ క్రీడా పోటీలు సాఫ్ట్ బాల్ మెదక్ లో, ఖోఖో నల్గొండలో అథ్లెటిక్స్ హన్మకొండలో ఈనెల 20నుండి 24 వరకు జరగబోతున్నాయి అన్నారు. సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ గ్రామ సర్పంచ్ మాదాసు ఆంజనేయులు, ఉపసర్పంచ్ కొమురయ్య, గ్రామస్తులు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *