మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
–మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ భవాని బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్
సిద్దిపేట జిల్లా, జనవరి, 8
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన తాడెం రవి, అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసి భవాని బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్ గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్ధిక సహాయం అందజేశారు. వార్డు సభ్యులు చిన్నబోయిన మల్లేష్,మ్యాకల శ్రీనివాస్,తాడురీ లక్ష్మణ్,కొండనోళ్ల కర్ణాకర్,రాజు,కుమ్మరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.





