వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ముందంజలో దూసుకపోతుందని దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధరి సంధ్యా రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు పార్టీ నాయకులతో సమావేశమైన ఎంపీపీ, జెడ్పీటీసీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో భారతీయ రాష్ట్ర సమితి దేశానికి అగ్రగామిగా బీఆర్ఎస్ పార్టీ ముందంజలో నిలువబోతుందని వారు తెలిపారు. నిన్నటికి నిన్న ఖమ్మంలో జరిగిన సంఘటనే నేడు ఢిల్లీ కంచుకోటను బద్దలు కొడుతుందనడానికే సవాల్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఎనిమిదేండ్లలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి అమలు పరిచారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటీసి వీరమ్మ మల్లేశం, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీమోద్దిన్, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంపల్లి శ్రీనివాస్, మీసేవ భాస్కర్, కొత్తింటి స్వామి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
