ప్రాంతీయం

ఇంకా జీతాలు రాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు

89 Views

అక్టోబర్ 06 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా:
మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా సుంకె విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,ఉపాధ్యాయులకు మరియు పెన్షణార్లకు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు .

ఈ నెలలో దసరా పండుగ ఉన్నందున ఉద్యోగస్తులు అందరూ జీతాలు రాక తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. దసరా పండక్కి కావాల్సిన నిత్యవసర వస్తువులు మరియు పిల్లలకు పెద్దలకు బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన  జీతం డబ్బులు ఎప్పుడు వారి అకౌంట్లో క్రెడిట్ అయితాయని ఎదురుచూస్తున్నారు. ప్రతినెలా ఏ తేదీకి జీతం డబ్బులు పడతాయో వారికే తెలియదని ఒకటో తారీకు వచ్చినప్పటినుండి రోజు మొబైల్ ఫోన్లో మెసేజ్ చెక్ చేసుకుంటున్నారు. వారి అకౌంట్లో డబ్బులు పడినాయో లేదో అని ఆందోళన పడుతున్నారు.

కావున తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు వారి వారి అకౌంట్లో క్రెడిట్ చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *