తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమును ఆరోగ్యవంతమైన తెలంగాణ గా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్య సౌకర్యాలు అందడానికి కంటి చూపు సమస్యలు ఉన్నవారికి కంటి వెలుగు కార్యక్రమం ద్వారా వైద్య సౌకర్యాలు అందిస్తారని రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి గజ్వేల్- ప్రేజ్ఞపూర్ మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుందని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి గుప్తా అన్నారు. గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డులో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తో కలిసి కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒకటో వార్డులో వారం రోజులపాటు కంటి పరీక్ష లు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు , ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ధన్యవాదాలు తెలుపుతూ, 1 వ వార్డ్ లో జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి, వివిధ ప్రజా ప్రతినిధులకు తదితరులు పాల్గొంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య మెడికల్ ఆఫీవర్ హిరన్ మహి, డీఈవో లిఖిత్, మాధురి మున్సిపల్ శాఖ అధికారులు , ఆశవార్కర్లు తదితరులు పాల్గొన్నారు