వర్గల్ మండల్ సెప్టెంబర్ 13:అన్న పూర్ణ సమేత స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం మాస శివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, మంత్రపుష్ప హారతి, తీర్థ ప్రసాద, అన్న ప్రసాద, వితరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి జంగం వీరభద్రయ్య శివ స్వామి మాట్లాడుతూ పూర్వము నుంచి ఆచారంగా పాటిస్తున్న ప్రతి యేట నిర్వహించేటువంటి శ్రావణమాస మాస శివరాత్రి రోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందుకు భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దేవాలయంలో కాశీ లక్షణాలు ఉండటంతో పూర్వం నుండి ఇక్కడి ప్రజలంతా చిన్న కాశిగా పిలుచుకొని చుట్టుపక్కల పల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు తీస్తున్నాడని అన్నారు.
