శ్రీ చైతన్య పాఠశాల పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ డిమాండ్
జనవరి 31
సిద్దిపేట జిల్లా చేర్యాల: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో. పూరం రాకేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్లో మత భావజాలాన్ని ప్రేరేపిస్తున్నారు అని పేరెంట్స్ నుండి కంప్లైంట్ రావడంతో ఎస్ఎఫ్ఐ నాయకులు స్కూలుకు వెళ్లి వివరాలు అడుగగా దీనికి సమాధానంగా స్కూల్ ఫ్యాకల్టీ దానిని సమర్థించుకోవడం ఎస్ఎఫ్ఐ నాయకులతో దురుసుగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మతతత్వ భావాలను బోధిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై మరియు మతతత్వ భావాలు కలిగిన టీచింగ్ ఫ్యాకల్టీ మీద ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు దర్శనం రమేష్ , రాకేష్ రెడ్డి, మహేష్, విష్ణు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.





