ప్రాంతీయం

రేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం…. వైద్యాధికారిణి డాక్టర్ స్రవంతి

241 Views

రేపటి నుండి కంటి వెలుగు ప్రారంభం

తెలంగాణా ను సంపూర్ణ అంధత్వం నిర్మూలన రాష్ట్రం గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టింది అని మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డి పెట్ పరిధిలోని ఎల్లారెడ్డి పెట్ మరియు వీర్ణపల్లి మండలాలల్లో మొదలు అవుతుంది అని తెలిపారు. మొత్తం మూడు టీమ్ లు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటాయి తెలిపారు. ఎల్లారెడ్డి పెట్, వీర్ణపల్లి, హరిదానగర్ గ్రామాలలో మొదలు అవుతాయని అని తెలిపారు. తెలంగాణలోని అందత్వనికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు, వారు ఎక్కడ నివసిస్తున్న, ఏమి చేస్తున్న, ఏ కంటి సమస్య ఉన్న వారైనా నివారణ మార్గాలను, అత్యున్నత నాణ్యత కల్గిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోకి తేవడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మండల ప్రజలు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found