ప్రజా పక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జనవరి 18 :ప్రజాపక్షం తెలుగు దినపత్రిక నూతన సంవత్సరాది 2023 క్యాలెండర్ ను ఎల్లారెడ్డిపేట మండల తహశీల్దార్ జయంత్ కుమార్ బుధవారం ఆవిష్కరించారు,ఈ సందర్భంగా తహాశీల్దార్ జయంత్ కుమార్ మాట్లాడుతూ ప్రజాపక్షం తెలుగు దినపత్రిక ప్రజల కోసం తాజా వార్తలను వెలువరుస్తూ ప్రజలను చైతన్య వంతులను చేస్తూ ప్రజల ప్రజాప్రతినిధుల మన్ననలను పొందుతుందన్నారు,ప్రజాపక్షం ప్రజల పక్షం మని ఆయన కొనియాడారు,ప్రజాపక్షం 2023 సంవత్సర క్యాలెండర్ ను సిఐ మొగిలి , ఎస్ ఐ శేఖర్ ఆవిష్కరించారు,ఈ కార్యక్రమం లో ప్రజాపక్షం విలేఖరి జగదీష్, సీనియర్ జర్నలిస్టు బండారి బాల్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ పాషా , కానిస్టేబుల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు,
