ప్రాంతీయం

వాలీబాల్ క్రీడాకారులకు సన్మానం

118 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం జరిగిన మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో ఇందుప్రియల్ గ్రామానికి మొదటి బహుమతి పొందడంతో మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్ వాలీబాల్ టీం సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి విజయాలు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో సాధించి గ్రామానికి పేరు తీసుకొచ్చే విధంగా యువకులు కష్టపడాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్ తోట కుమార్, నరేందర్ రెడ్డి, డేవిడ్, రాజు, స్వామి, స్వామి, పంచాయతీ కార్యదర్శి రాజేష్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh