సిద్దిపేట / రాయపోల్
ఆంధ్రశక్తి ప్రతినిధి
నవంబర్ 24.
రాయపోల్ మండల కేంద్రంలోని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సహదేవుకు వినతి పత్రం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగన్నగారి రాజిరెడ్డి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ధరణి పోస్టల్ రద్దు చేయాలని అసైన్మెంట్ భూములకు పట్టా భూములతో సమానంగా హక్కు కల్పించాలని అదేవిధంగా రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని వెంటనే రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు, రైతు బీమా, రైతు బందు సక్రమంగా ఇవ్వాలని రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి వారికి ఖాతాల్లో డబ్బులు వెంటనే వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కృష్ణారెడ్డి, సత్తుగారి రవీందర్ రెడ్డి, రాయపోల్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు దుర్గ ప్రసాద్, గుంటి నర్సింలు, ముంగాజిపల్లి గ్రామ అధ్యక్షులు రాజు, సత్తుగారి తిరుపతిరెడ్డి, సింగరమైన వెంకట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.