Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,

278 Views

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం న్యాయవాది గా పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి తాను పార్టీలో చేరానని తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని గ్రామాలలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కృష్ణ అన్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి కృష్ణ శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, కిసాన్ సెల్ జిల్లాఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, నాయకులు కొత్తపల్లి దేవయ్య,సూడిది రాజేందర్, మానుక నాగరాజు,గుండ్ల శ్రీనివాస్ ,చెట్టుపల్లి బాలయ్య ,ఎండి ఇమామ్ ,మేడిపల్లి రవీందర్, బుచ్చిలింగం సంతోష్ గౌడ్, ఎండి రఫీక్ ,కోనేటి పోచయ్య , పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, సిరిపురం నరేందర్, మామిండ్ల కిషన్ ,లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *