అర్హులైన 260 లబ్ధిదారుల కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ*
*ఎమ్మెల్యే సతీష్ కుమార్
సెప్టెంబర్ 5
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో అర్హులైన 260 లబ్ధిదారుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేశామని, మిగతా 300కు పైగా ఇండ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. నియోజకవర్గానికి గృహలక్ష్మి పథకం కింద మూడువేల ఇండ్లు మంజూరయ్యాయని, అవి లబ్ధిదారులకు కేటాయించిన తర్వాత మరో మూడు వేల ఇండ్ల మంజూరును తీసుకువస్తామన్నారు. 15 లక్షల విలువ గల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో పెట్టారనే విషయాన్ని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాని అర్హులకు గృహలక్ష్మి పథకం కింద ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జీవో 58 కింద అర్హులైన ఇండ్ల స్థలాల పట్టాలను ఇవ్వాలని స్థానిక ఆర్డివో కు సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ ఆకుల రజిత, ఆర్డిఓ బెన్ షాలోమ్, ఎమ్మార్వో రవీందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ చైర్పర్సన్ ఎడబోయిన రజిని మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ తిరుపతి రెడ్డి,కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు ఆయుబ్ భాషా యూత్ నాయకులు,లబ్ధిదారులు పాల్గొన్నారు,
