Breaking News

సేవరత్న అవార్డ్ గ్రహీత మేకల కనకయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

164 Views

 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యువతకు క్రికెట్ పోటీలు సేవరత్న అవార్డు గ్రహీత బిఆర్ఎస్ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ గుంటుకు శిరీష రాజు, మర్కాంటి వరలక్ష్మి కనకయ్య హాజరయి వారు మాట్లాడుతూ మేకల కనకయ్య రాజకీయ రంగంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ యువత క్రీడల్లో రాణించే విధంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం అని కనకయ్య ముదిరాజ్ సేవలు గుర్తించి ఇటీవల సెవరత్న అవార్డ్ రావడం సంతోషం అని అన్నారు అలాగే మేకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని మర్కుక్ మండల యువతకు అండగా వుంటానని యువత దృడ సంకల్పంతో ముందుకు సాగాలని ఉన్నత చదువులు చదివి తల్లి తండ్రులకు గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాముల పర్తి గ్రామ శాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేష్, బిఆర్ఎస్ నాయకులు పాముల పర్తి కరుణాకర్,కొంపల్లి శ్రీనివాస్, ప్రభాకర్, నర్సింలు, శ్రీకాంత్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found