ముస్తాబాద్ (ప్రతినిధి) జనవరి 14, ఈరోజు సంక్రాతి పండుగ సందర్భంగా డబల్ బెడ్ రూమ్ కెసిఆర్ నగర్ తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇట్టి పోటీలో 50 మంది ముగ్గులు వేయడం జరిగింది.1.రెడ్డి అఖిల 1st ప్రైజ్ , 2. కొండా సాహిత్య 2nd ప్రైజ్, ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం, జడ్పీటీసీ పూర్మనీ మంజుల – లింగారెడ్డి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, బి ఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, రాగిపెల్లి జీవన్ రెడ్డి, నక్క కుమార్, ఎండ్ర విజయ్, తదితరులు పాల్గొన్నారు.
