ప్రాంతీయం

సిరిసిల్ల పట్టణంలో మహిళా కమిటీ …

102 Views

ముస్తాబాద్ డిసెంబర్ 01 బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల పట్టణ మహిళ కమిటీని ప్రకటించారు. ఇందులో పట్టణ అధ్యక్షురలుగా బుస్సపురం అనూజ, ఉపాధ్యక్షులుగా మోతే రమ్య , దందుగు తేజ, ప్రధాన కార్యద్శులుగా కొలపురి అవనిక, పంగ అక్షిత, అధికార ప్రతినిదిగా పోతురి శ్రీ అంకిత, గౌరీ దీక్ష, కార్యదర్శులుగా కమట సౌమ్య, బత్తుల అక్షర, దండుగ అంజలి, బంటు వర్షలు ఉన్నారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బిసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సమస్యలపై ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు. బిసి విద్యార్థి సంఘం బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ , విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్