అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం – మహమ్మద్ల్ లాల
అనారోగ్యంతో మృతి చెందిన పుట్టి బిక్షపతి (50)
మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పుట్టి బిక్షపతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం 03:45 నిమిషాలకు మరణించారు,మృతునికి భార్య సునంద (45), కూతురు స్రవంతి (22) ఉన్నారు, మరణ వార్త తెలుసుకున్న ఎన్ఆర్ఐ గల్ఫ్ వర్కర్స్ అవేర్నెస్ సెంటర్ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు మహమ్మద్ లాలా, గొల్లపల్లి గ్రామానికి చెందిన మృతుడు బిక్షపతి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తనవంతుగా వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు, ఎల్లారెడ్డిపేట మండలంలోని నిరుపేద కుటుంబంలో ఎలాంటి ఆపద వచ్చినా మహమ్మద్ లాలా ముందుండి తనకు తోచినంతగా సహాయం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు, దాతలు ఎవరైనా ముందుకొచ్చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు
