Breaking News

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్

98 Views

పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని, పాదయాత్రగా ఇల్లంతకుంటకు బయలుదేరిన ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థులలో, హుజురాబాద్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. వీణవంక ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అభిమాని, హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలవాలని, శుక్రవారం వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర

వీణవంక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నుండి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు.అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..తెలంగాణ ముద్దుబిడ్డ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి రాబోవు ఎన్నికలలో ఘన విజయం సాధిస్తారని, హుజురాబాద్ అభివృద్ధి ప్రదాత, అభివృద్ధి చేయిస్తూ, కష్టసుఖాలు నేనున్నానంటున్న, నికర్సయిన, ముక్కుసూటి, నిజాయితీగల, నిప్పు లాంటి మహానేత మా బిఆర్ఎస్ నేత పాడికౌశిక్ రెడ్డి అని, యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న రాజకీయ నేత మాట్లాడారు. ఈ పాదయాత్ర మండలాల్లో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ వనమాల సాధవరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు రఘుపాల్‌రెడ్డి, యాసిన్‌, కొండల్‌రెడ్డి, రెడ్డి రాజుల రవి, లస్మక్క పల్లి గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు
.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *