తొగుట 18 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని కాన్ గల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెండవసారి కంటి వెలుగు కార్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభిస్తుంది తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలు 18 సంవత్సరాలు,ఆ పైబడిన వారందరు కంటి వెలుగు పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని సూచించారు. పరీక్షల అనంతరం అద్దాలు అవసరం ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు.ఎక్కువగా ఇబ్బంది ఉన్న వారికి మరింత సమయం తీసుకొని వారికి కావాల్సిన సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈకార్యక్రమాన్ని ప్రచార మద్యమలతో,
గ్రామాలలో డప్పు చాటింపు,
మైక్ ల ద్వారా అధికంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవరెడ్డి గారి
ప్రేమల చంద్ర రెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య, వార్డు సభ్యులు,ఆశా కార్యకర్తలు,
గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
