ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్25, శ్రీమతి సావిత్రిబాయిపూలే మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాల ఆవిష్కరణ ముస్తాబాద్ మండలం, కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం 30.07.2023 రోజున ఘనంగా విగ్రహావిష్కరణ చేశారు. ఆ విగ్రహల ఆవిష్కరణకు తనవంతుగా ఆర్థిక సహాయం అందించి అదేవిధంగా గ్రామంలో సాయిబాబా ఆలయానికి నిన్నటి రోజున 5,లరూ అందించిన నాగెల్లి దేవానంద్ ముదిరాజ్ సంఘం తరుపున ఘనంగా సన్మానించడం సన్మానించారు. ఈసందర్భంగా గ్రామస్తులు నాగెల్లి దేవానంద్ వృత్తిపరంగా ముంబై ఉంటూ ఆధ్యాత్మిక భాగంగా అభివృద్ధి దిశగా తన వంతు సహాయంగా విగ్రహాల ఆవిష్కరణ కొండాపూర్ లో చేయడం అంటే కొండాపూర్ గ్రామం అభివృద్ధి పధంలో నడుస్తుందని యువతకు సమాజం పట్ల పూర్తి అవగాహన అభ్యుదయ స్ఫూర్తి ఉందని అనడానికి నిదర్శం అన్నారు. అదేవిధంగా ఇలాగే అన్ని రంగాల్లో కొండాపూర్ యువత ముందుకు వచ్చి గ్రామాన్ని మరియు సమాజాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని కోరారు. ముదిరాజ్ సంఘం సభ్యులు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెల్పారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ సమాజంలో ధనవంతులు చాలా మంది ఉంటారు. కానీ దానం చేసే గుణం కొంత మందికే ఉంటుంది అని అందులో మొదటి వరుసలో నాగెల్లి దేవానంద్ ఉంటారు అని తెల్పారు. వారు బడికి, గుడికి ఊళ్ళో చేపట్టిన ప్రతి అభివృద్ధి పనుల్లో వారి చేయూత ఉందని తెలిపారు. అంతే కాకుండా పుట్టిన ఊరికి ఎప్పటి కప్పుడు తనవంతుగా అన్నివిధాలుగా చేయూత అందిస్తాను అని వారు తెలుపడం వారికి గ్రామం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం అని తెల్పారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇంకా భవిష్యత్ లో గొప్ప పనులు చేపట్టాలని వారు ఎప్పటికి శ్రీమంతులుగా ఉండాలని , ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు సదా ఉండాలని కోరుతూ ముదిరాజ్ సంఘం తరుపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెల్పారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చిగురు దేవేందర్, గణాది నర్సయ్య, చిగురు పెద్ద రాజం, చిగురు పెద్ద నర్సయ్య, చిగురు యాదయ్య,చిగురు వెంకటి, చిగురు ఖాషయ్య, చిగురు నరేష్, చిగురు శంకర్, చిగురు రాములు, చిగురు నరేష్, గణాది రాజు, చిగురు పర్శరాములు, కొలకాని కిషన్, నాగెళ్లి ప్రశాంత్ , మర్వాడి గంగరాజు, చిగురు ఈశ్వర్, నవాబ్, సుతారి కిషన్, సర్థాని శంకర్, సర్థాని బాల్ రాజ్, పెద్దూరి శ్రావణ్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




