ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 26, మండల కేంద్రంలో నేడు ముదిరాజ్ కులస్థులు ధర్నాచేశారు. ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులస్థులను కించపరుస్థూ అసభ్యకర పదజాలతో దుర్భాషలాడి కౌశిక రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని ముదిరాజ్ కులపెద్దలు పెద్దఎత్తున హాజరై ప్రధానచౌరస్తా కూడలిలో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డికి ఫ్లెక్సీఫోటోకు పాడెను కట్టి ప్రధాన రహరహదారి వెంబడి డప్పు సప్పులతో చెప్పులదండతో ఫ్లెక్సీఫోటో తీసుకెళ్లి దింపుడుకాలంచేసి పిట్టకు పెట్టే సాంప్రదాయవిధానాన్ని పాటించి దిష్టిబొమ్మను చౌరస్తాలో దహనం చేశారు. ఆసమయంలో రోడ్లకు రెండువైపులా పెద్దఎత్తున వాహనాలు స్తంభించాయి. ఈసందర్భంగా ముదిరాజ్ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా వారికి ఇవే గతిస్థితులు వర్తిస్తాయని అన్నారు. ఇకపోతే అబద్ధాలు ఆడుట్లు కౌశిక్ రెడ్డిదిట్ట తేలింది కౌశిక్ రెడ్డిమాటలు రికార్డులో ఉన్నప్పటికీ మిమిక్రీ చేసిండని బొంకనేరుసుట్ల తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఇలాంటి వ్యక్తికి అలాంటి ఎమ్మెల్సీ పదవిచ్చిన కెసిఆర్ వెంటనే ఎమ్మెల్సీ పదవినుండి వేనువెంటనే తొలగించాలని ముదిరాజులు కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష కోరిన సహించ బొమని తగినగుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలోమండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు రాణవేణి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి చాడ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి గజ్జల రాజు, జాల బిక్షపతి, శంకర్, అబ్రమేని సాయిలు, సత్యనారాయణ, అనమేని రాములు, పుల్లూరి రవి, కంచం లక్ష్మణ్, కంచం నర్సింలు, గీస బిక్షపతి, దేవయ్య, రాములు, నారాయణ, ముదిరాజ్ సంఘ సభ్యులు ముదిరాజ్ కులసంఘ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, మండలంలోని అన్ని ముదిరాజ్ కులసంఘాల నేతలు, వివిధ పార్టీలో మిలీనమైన రాజకీయ నాయకులు, పాల్గొన్నారు.
