ప్రాంతీయం

జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

103 Views

దౌల్తాబాద్: ఇటీవల మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ ఫ్లోర్ బాల్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా తరపున పాల్గొని ప్రదర్శన కనబరిచి జాతీయ ఫ్లోర్ బాల్ జట్టుకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ టిఎన్ యజ్ఞశ్రీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 15, 16, 17 వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ ఐటిఎం యూనివర్సిటీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు సాయికిరణ్, రోహిత్, నరేందర్, బాలరాజ్, అనిల్, రాకేష్, అంజి, వేదాంత్ కుమార్, యోగేందర్, కౌశిక్ ఎంపిక కావడం వల్ల విద్యార్థులను సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, ఎంపీటీసీ అది వనిత వేణుగోపాల్, చైర్మన్ శ్రీనివాస్ అభినందించి, క్రీడా దుస్తులను అందజేశారు. అనంతరం క్రీడాకారులను తయారుచేసి జాతీయస్థాయికి ఎంపిక అయ్యేటట్లు చేసిన పిడి సురేష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్ హుస్సేన్, పీడీ సురేష్ తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh