ప్రాంతీయం

ఘనంగా స్వామి వివేకానంద జయంతి

114 Views

దౌల్తాబాద్ లోని యువజన సంఘాల అద్వర్యం లో 160వ స్వామి వివేకానంద జయంతి ఘనంగా నిర్వహించారు. పులిమామిడి(కిష్టాపూర్)మాజీ సర్పంచ్ సీనియర్ జర్నలిస్ట్ నాయిని రాజగోపాల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద మన భారత దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది.అంటూ యావత్ యువ లోకానికి స్ఫూర్తి నింపిన గొప్ప మేధావి
స్వామి వివేకానంద అని అన్నారు బలమే జీవనం బలహీనతే మరణం అని,ఇనుపకండలు ఉక్కునరాలు వజ్ర కఠోరమైన యువత దేశానికి అవసరమని పిలుపునిచ్చిన గొప్ప మహిను భావులన్నారు నా దేశంలో ఒక కుక్క ఉపాసమున్నా నాకు మోక్షం లభించదని చెప్పిన గొప్ప మానవతావాది అన్నారు నేటి యువత వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు ఈ కార్యక్రమంలోసర్పంచ్ ముత్యం గారి యాదగిరి, సెక్రటరీ యాదగిరి, ఆది వేణుగోపాల్, మాదంశెట్టి ఆనంద్, బొట్క మల్లేశం కనకరాములు ,నర్సింలు,వేణు ప్రభు,పోచయ్య,రాజు,శేఖర్,మహేష్,కిష్ణంరాజు, శివ, అరుణ్ ,నరేష్, వీరేష్, స్వామి,సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Jana Santhosh