ప్రతి క్వింటాలు పత్తికి కనీస ధర 12000 గా నిర్ణయించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని స్థానికంగా చందా రాజు మాట్లాడుతూ ఆరుగాలం పండించిన పత్తి పంట సరైన ధర లేక సంచులలో ములుగుతున్నదని, దళారులు మోసం చేస్తూ తక్కువ ధరకు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో వర్షాలు పడడం వల్ల పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులంతా ఇబ్బందుల్లో ఉన్నారని, కావున ప్రభుత్వం పత్తి ధరను 12,000రూపాయలు గా నిర్ణయించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులని ఇబ్బందులకు గురి చేయకుండా వెంట వెంటనే విక్రయాలు జరపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులందరూ కూడా దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని గుర్తు చేశారు.
