ప్రాంతీయం

బిజెపిలో పార్టీలో భారీ చేరికలు…

285 Views

ముస్తాబాద్, నవంబర్13, (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్ గ్రామం నుండి బారిసంఖ్యలో యువత బండి సంజయ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారని కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్ తెలిపారు. యువత దేశంకోసం ధర్మంకోసం నిస్వార్థంగా ముందుకెళ్తూ ప్రస్తుతం యువత ఎలాంటి ఆశలకు లొంగకుండా ధైర్యంగా వచ్చారని వీరిని ఆదర్శంగా తీసుకొని యువత బారిసంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మహేందర్, ఇరవేణి తేజ, దార వేణి నవీన్, పాక రాకేష్, తోపులసూర్య, రాగం రాకేష్, బాధవేణి రంజిత్, గీసరాకేష్, వీరవేణి నవీన్, లింగంపల్లి వెంకటేష్, పవన్, ఏకే గౌడ్, రంజిత్ గౌడ్, రాకేష్, నవీన్, మధు, వెంకటేష్, చందు, భరత్ విఘ్నేష్ పారిపెల్లి భరత్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *