గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజుకు ఇటీవల రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సంధర్భంగా గురువారం గజ్వేల్ కిరాణా వర్తక సంఘం కార్యాలయంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆధ్వర్యంలో రామకోటి రామరాజును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు నుండి వేలాది చిత్రాలను తనదైన శైలిలో వేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అందుకు గాను కళరత్న రాష్ట్రస్థాయి అవార్డుతో రామకోటి రామరాజును సత్కరించడం కళామతల్లి ముద్దుబిడ్డ అది మా గజ్వేల్ వాసి కావడం మాకు ఆనందంగా ఉందన్నారు. పలు రకాల ధాన్యాలతో మొదలు కొని పప్పుల వరకు ప్రతి ఒక్క వస్తువును ఉపయోగించి తనదైన శైలిలో భగవంతుని చిత్రాలు, దేశ ప్రముఖుల చిత్రాలు, వర్ధంతి, జయంతి సందర్భంగా ప్రతిఒక్క చిత్రం వేయడం అనేది రామకోటి రామరాజు కే సాధ్యమన్నారు. ఇలాంటి చిత్రాలు మరెన్నో వేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధి బిక్షపతి, కొండపోచమ్మ దేవస్థాన ధర్మకర్త గోలి సంతోష్, తోట బిక్షపతి, శివ కుమార్, అమర నాగేందర్, జగ్గయ్య గారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు