*గురుకులాల వసతులపై చర్చకు సిద్ధమా*
-అభివృద్ధి చేస్తే బోథ్ శాసనసభ్యులు చర్చకు రావాలి
-కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి
ఆదిలాబాద్ జిల్లా: పది సంవత్సరాలు గురుకుల విద్యాలయాలను అంధకారంలో నేట్టి నేడు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ గురుకులలా బాట పట్టిందని, చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టు ఆ పార్టీ వైఖరి ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి ఎద్దేవ చేశారు.10 సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ ప్రచారం కోసం మౌలిక వసతులు కల్పించకుండా అద్దె భవనాల్లో గురుకులాలు ప్రారంభించి చాలీచాలని వసతులతో,బోధన సిబ్బంది,బోధనేతర సిబ్బంది లేకుండా గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర పన్ని నేడు మోసలి కన్నీరు కార్చడం విడ్డూరం అని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో పది నెలల్లోనే గురుకులాల విద్యార్థులకు 75 శాతం మేస్ చార్జీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది,సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను, కళాశాలలను ప్రతి నియోజకవర్గానికి ఒకటి ప్రారంభిస్తూ 25 వేల మంది విద్యార్థులకు విద్యా అవకాశాలను సుగుమం చేస్తున్నామని.ఇవి కానరాకుండా ఎక్కడో జరిగిన సంఘటనను బూచి చూయించి రాజకీయ పబ్బం గడుపుకోవడం మానుకోవాలని టిఆర్ఎస్ శ్రేణులకు హితవు పలికారు.గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు నేరడిగొండ జడ్పిటిసి గా ఉన్న సమయంలో నేరేడుగొండ కేజీబీవీ లో జరిగిన సంఘటన ఏం సమాధానం చెప్తారో,దమ్ముంటే తెలంగాణలో గురుకుల విద్యాసంస్థల పది సంవత్సరాల అభివృద్ధిని మా ప్రజ ప్రభుత్వం 11 నెలల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని స్థలం సమయం చెప్పి బోథ్ అంబేద్కర్ విగ్రహం వద్ద రావలసిందిగా సవాల్ విసిరారు.
