తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 22
రోగులకు,పారిశుద్ధ కార్మికులకు అరటి పండ్లు,మజ్జిగ, బ్రేడ్ ప్యాకెట్లు,పంపిణీచేసిన అధ్యక్షులు మంగళ పెళ్లి హుస్సేన్
దాత అర్ రాకేష్ ను సన్మానం చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు
తొర్రూర్ డివిజన్ మార్చి 22 శుక్రవారం స్థానిక మున్సిపల్ కేంద్రం మహబూబాబాద్ జిల్లా,తొర్రూరు డివిజన్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాత ఆర్,రాకేష్ హ్యూమన్ రైట్స్ కమిటీ మెంబర్ సహకారంతో ఈ రోజు డివిజన్ కమిటీ సభ్యులు మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు,డాక్టర్స్ కలిసి రోగులకు పారిశుద్ధ కార్మికులకు బ్రెడ్ ప్యాకెట్లు,మజ్జిగ, అరటి పండ్లు,పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ,కరోనా సమయంలో వారు చేసిన సేవలు,పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివని అన్నారు.ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్,పల్లెర్ల రమేష్,రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా నర్కుటి రామారాజు రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం లాలయ్య, సోషల్ సర్వీస్ గార.వీరస్వామి,డివిజన్ కమిటీ మెంబర్ నాగేష్, డివిజన్ కమిటీ సభ్యులు నరేష్,మంగళపల్లి యాకయ్య,మహిళా మండలి సభ్యులు ఆశా వర్కర్లు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
