ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో సహా అక్క పల్లి గ్రామాలలో ఇరువురి బాధిత కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం గురువారం అందించారు శ్రీ వట్టెల హనుమయ్య యాదవ్ బుధవారం రోజున పరమపదించినారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు.వారికి తక్షణ సహాయం కింద 4000/ రూపాయలు ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేయడం జరిగింది. ఇందులో మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, బొల్లు భూమయ్య యాదవ్, నాగమల్లేష్ యాదవ్ ,వట్టెల ఎల్లయ్య యాదవ్, అనిల్ బాధిత కుటుంబాలకు అంతేకాకుండాఅక్క పెళ్లి గ్రామానికి చెందిన కంది బలరాం అనారోగ్యంతో బుధవారం రోజున సాయంత్రం మరణించాడు. తన మిత్రుని మరణ వార్త తెలుసుకున్న సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి హుటహుటీన చిన నాటి మిత్రులతో కలసి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కటిక నిరుపేద కుటుంబానికి చెందిన బలరాం యొక్క ఆర్థిక పరిస్థితి చూసి చెలించిన కృష్ణా రెడ్డి అప్పటికీ అప్పుడు తనవంతు సహాయం గా తన మిత్రుని అంత్య క్రియలకు 4000/- రూపాయలను అందజేసి ఇరువురి బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. మొత్తం 8 వేల రూపాయలు 4000 రూపాయల చొప్పున ఇరువురు కుటుంబాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో చిన నాటి మిత్రులు కోడిమోజు దేవేందర్, శామంతుల అనిల్,చందనం రాఘవేందర్,రాపోలు బాబు పాల్గొన్నారు.
