112 Views

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ సంబంధించి శనివారం నాడు సిరిసిల్ల పట్టణంలో మీటింగ్ ఏర్పాటు చేయడం ఇట్టి కార్యక్రమానికి ముస్తాబాద్ మండలంలో ఉన్న అన్ని గ్రామాల బూత్ అధ్యక్షులతోపాటు అట్టి బూతులో ఉన్నటువంటి సభ్యులను మీటింగ్ కి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క బూత్ అధ్యక్షుడు కృషి చేయాలని కోరారు. అలాగే ఈ సంవత్సరంలో అనేక రకాల ఎలక్షన్లు జరుగుతాయి కావున పార్టీ కార్యకర్తలు అందరూ భారతీయ జనతా పార్టీకి సమయం కేటాయించి అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుడాటి వెంకట్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చర్లపల్లి సుధాకర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్. యువమోర్చా అధ్యక్షులు జనార్ధన్, దళిత మోర్చా అధ్యక్షుడు తిరుపతి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మల్లేశం, బిజెపి నాయకులు వెంకన్న, రమేష్. శేఖర్, కిట్టు, కళ్యాణ్, అజయ్, మహేష్,బాబు, మరియు కార్యకర్తలు పాల్గొన్నామని తెలిపారు.

