సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ వాసవి సేవా దళ్ అధ్యక్షులుగా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో మంగళవారం రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు పదవి రావడానికి సహకరించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు అయిత రత్నాకర్,జిల్లా మాజీ అధ్యక్షులు కాసం నవీన్, సీనియర్ నాయకుడు తడక లింగమూర్తి, ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇటిక్యాల గ్రామం అభివృద్ధికి కృషి చేసి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు పొందిన రావికంటి చంద్రశేఖర్ సమాజసేవ ముందు వరుసలో ఉంది మంచి గుర్తింపు పొందారని ఏ పదవి వచ్చిన ఆ పదవి వన్నె తెస్తాడు రావికంటి చంద్ర శేఖర్ అని జగదేవపూర్ ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్నారు.
