ముస్తాబాద్ జనవరి 11, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద జయంతి జనవరి12 న నేషనల్ యూత్ డే గా దేశమంతటా భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం.1893 లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సర్వసభ్య సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగం తరువాత, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానంద జీవితంలో చాలా చెప్పుకోదగ్గ సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆయన కీర్తి ఎంతో గణనీయమైనది అతను 40 ఏళ్ల వరకు బతకలేనని అంచనా వేసాడు. అందుకే 4 జూలై, 1902న ధ్యానం చేస్తూ మరణించాడు. అతను ‘మహాసమాధి’ పొందాడని మరియు గంగానది ఒడ్డున దహనం చేశారని చెబుతారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో వివేకానంద విగ్రహంవద్ద జయంతి వేడుక ఉదయం 10. గంటలకు జరుపుకోవాలని మల్లారం సంతోష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు చిన్నలు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.
