ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 27, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించాలని మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవంతంగా మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను కఠినంగా శిక్షించాలి అని రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేయించడం జరిగింది. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో వేరువేరు చోట్ల మహిళల పట్ల విద్యార్థుల పట్ల ఎక్కడో ఒక దగ్గర సీనియర్ల ర్యాగింగ్ లు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, పట్టణ అధ్యక్షులు రుద్రవేణి సుజిత్ కుమార్, విద్యార్థులు రమ్య, దీక్ష ,శ్రీజ, అవానికా, సాహితీ, నందిని, మానస, శృతి, గౌతమి, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
