మంచిర్యాల జిల్లా:
జైపూర్ మండలం శెట్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్ల కు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు.
వివేక్ కామెంట్స్
గతం లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి.కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి బంగారు తెలంగాణ ను దోచుకున్నారు. వంద ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నాడు కానీ పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వలేదు. గరీబి హటావో అనే నినాదాన్ని తీసుకువచ్చింది ఇందిరా గాంధీ.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం.ఆరు కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గం లో స్కూల్స్ మరమ్మతులకు నిధులు మంజూరు అయ్యాయి. రెండు కోట్ల తో కస్తూర్బా స్కూల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.50 వేల మంది స్కూల్ టీచర్లను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మాట ఇచ్చి తప్పింది. ప్రజలు పది యేండ్లు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల జిల్లా లో పదిహేను రోజుల్లోనే 20 వేలకు పైగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి.అందరూ మీసేవల్లో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేయాలి. అధికారులు పరిశీలించి వెంటవెంటనే రేషన్ కార్డులు ఇస్తున్నారు.
