మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రంలో గురువారం నిర్వహించే కార్నర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండ సురేఖ, పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




