రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాలనుసారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు గంభీరావుపేట మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ ప్రియతమ నాయకుడు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి భారజోడో యాత్ర యొక్క సారాంశాన్ని దేశం నలమూలల విస్తరించే విధంగా గ్రామ గ్రామాన గడప గడపకు “హాత్ సే హాత్ జోడో”కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో విభజించు పాలించు అనే ధోరణిలో భారతదేశాన్ని నాశనం చేస్తు ప్రజా వ్యతిరేక మరియు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని కుటుంబ పాలన కొనసాగిస్తూ నాలుగు లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో హమీద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు లచ్చయ్య శ్రీనివాస్ ఎల్లారెడ్డి తాహెర్ విటల్ గాడ్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పంతం సురేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గంగి స్వామి ఎలుక రాజు వివిధ గ్రామాల అధ్యక్షులు పాపా గారి రాజు జోగు సురేష్ మేడా భాస్కర్ సత్యం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు




