????త్వరలో మళ్లీ క్షేత్ర స్థాయి తనిఖీలు*
*????ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఉన్న ఓటర్లను గుర్తిస్తాం: వికాస్‌రాజ్*
‘ఒకే ఫొటోతో వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారిని గుర్తించేందుకు మరోదఫా క్షేత్రస్థాయి తనిఖీలను చేపట్టనున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రాష్ట్రంలో అలాంటి ఓటర్లు 12.55 లక్షల మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి పంపిందన్నారు. రెండు, మూడు వారాల్లో ఆయా చిరునామాలకు పోలింగ్‌కేంద్ర స్థాయి అధికారులను పంపి పరిశీలన చేయిస్తామన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో నిర్వహించాల్సిందిగా కలెక్టర్లకు స్పష్టం చేశాం. ఈసీ రూపొందించిన పాటను అన్ని పోలింగు కేంద్రాల్లో ప్రదర్శించాలి. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో చురుగ్గా వ్యవహరించిన అధికారులకు ఆరోజు అవార్డులు అందజేస్తాం. 2019డిసెôబరు నుంచి 2022 సెప్టెంబరు వరకు జారీ చేయని వారికి కార్డులను స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపుతున్నాం. 15.6 లక్షల కార్డుల్లో ఇప్పటికే 14 లక్షలను పంపాం. మిగిలిన వారికి త్వరలో పంపుతాం. ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది’ అని వికాస్‌రాజ్ పేర్కొన్నారు