సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల స్వామి బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల స్వామి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని అన్నారు అనంతరం కొన్యాల బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాడి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రావడానికి ఎంతో దోహదం చేసిన కిసాన్ కాంగ్రెస్ రాబోయే రోజుల్లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షుడు సింగం రాజు యాదవ్, జిల్లా సెక్రెటరీ కరుణాకర్, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు
