మర్కూక్ మండల కేంద్రంలో ఆదివారం మర్కూక్ ద్విచక్ర వాహన మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో ఇటీవల సేవ రత్న అవార్డు పొందిన మర్కూక్ మండల్ బిఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ కు శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కుమ్మరి రాజు మాట్లాడుతూ మ్యాకల కనకయ్య ముదిరాజ్ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మ్యాకల కనకయ్య ముదిరాజ్ కి హైదరాబాద్ లో సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సేవ రత్న అవార్డు రావడం అభినందనీయం అని వారికి చిరు సన్మానం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కొండా బాలకృష్ణ, గణేష్ ,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సింలు, యూనియన్ సభ్యులు నరేష్,నందు యాదవ్,సిద్దు,సురేష్,సాజిత్, గోపి,రమేష్,నరేష్,బాబు,మహేష్ బాబు,ఆనంద్, వినోద్ తదితరులు ఉన్నారు