ప్రాంతీయం

ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

76 Views

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్  జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ అనురాగ్ జయంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, డీపీఓ వీర బుచ్చయ్య, డీవైఎస్ఓ రాందాస్, సిరిసిల్ల తహసీల్దార్ షరీఫ్ మొహినొద్దీన్, మున్సిపల్ కమిషనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7