ప్రాంతీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, 30 పడగల ఆసుపత్రిని పట్టించుకోని మంత్రి కేటీఆర్…

176 Views
    ముస్తాబాద్ జనవరి 7, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల మరియు 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన కార్యక్రమము చేశారు. ఈనియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసిన పట్టించుకోవడం లేదు మండలానికి పర్యటనకు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతుందని పర్యటనను అడ్డుకుంటారని డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుపుతున్న ఇంతవరకు మంజూరు చేయలేదు. ముస్తాబాద్ మండలంలో పేద ప్రజలు ప్రైవేటు దవాఖానల్లో వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు .బుర్ర రాములు గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగారి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి వుచ్చిటి బాల్రెడ్డి. అరుట్ల మహేష్ రెడ్డి, దీటి నర్సింలు. ముద్దం రాజేందర్ రెడ్డి, రంజాన్ నరేష్, యాగండ్ల మల్లేష్, కేసు గాని బాబు, చింతల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7