ఇల్లు కూలిపోయి నిరాశృలయిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
ఎల్లారెడ్డిపేట :
ఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక సహాయంతో పాటు రెండు రేకుల రూములు నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, హసన్ బాయ్, రాగట్లపల్లి గ్రామానికి చెందిన యూత్ సభ్యులు పాల్గొన్నారు.
