ప్రాంతీయం

ఎంపీడీవో చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ

273 Views

సిఐటియు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్తం తంగళ్ళపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో లచ్చాలు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందిఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియు క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపిడిఓ కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్నారని కార్మికులకు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , వేతనాలను పెంచి నెలనెలా వేతనాలు సక్రమంగా చెల్లించాలని కార్మికులను పని నుండి తొలగించడం మానుకోవాలని కార్మికులపై అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధుల వేధింపులను అరికట్టాలని కార్మికులకు ఇవ్వాల్సిన రక్షణ సామాగ్రిని అందించాలని కోరారుఈ కార్యక్రమంలో యూనియన్ మండల నాయకులు బుర్ర శ్రీనివాస్ , లింగంపల్లి కృష్ణవేణి , కోల చంద్రయ్య , రవీందర్ , దేవయ్య , తిరుపతి , రాజు , దుర్గయ్య , అనిల్ , స్వామి , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్