ప్రాంతీయం

రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా

27 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా.

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్.

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అసాంఘిక కార్యకలాపాలతో భయభ్రాంతులకు గురిచేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ హెచ్చరించారు. బుధవారం రాత్రి తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలో నేర ప్రవృత్తి కలిగిన రౌడీషీటర్ల ఇండ్లను డీసీపీ ఆకస్మిక తనిఖీ చేసి వారి కదలికల వివరాల పై ఆరా తీసిసారు. వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి రానున్న గ్రామపంచాయతీ ఎలక్షన్స్ లో ఎలాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సత్ప్రవర్తన దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఎటువంటి గొడవలు చేయవద్దని, ఒకవేళ ఎవరైనా గొడవలు చేసినట్లయితే పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని వారిని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేశామని, ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులను కట్టడి చేసేందుకు మంచిర్యాల జోన్ పోలీసు కార్యాచరణ రూపొందించి, నిఘా పెంచి అన్ని కోణాల్లో దృష్టి సారించిందని అన్నారు. ఇప్పటికే జిల్లాలో గత ఎన్నికల కేసుల్లో గొడవల్లో ఉన్న పాత నేరస్థులు, రౌడీ షీటర్స్ లను బైండోవర్ చేసి మళ్ళీ ఇతర నేరాలకు పాల్పడకుండా వారి కదలికల పై నిఘా ఉంచామని అన్నారు. ఎవరైన బైండోవర్ ఉల్లంఘించి గొడవలకు గాని ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో రవికుమార్ ఏసీపి బెల్లంపల్లి , హనొక్ బెల్లంపల్లి రూరల్ సర్కిల్, రామకృష్ణ ఎస్సై తాళ్ల గురజాల పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *