కర్బుజ కాయ మీద మహాశివుని చిత్రం వేసిన రామకోటి రామరాజు
ఎన్నో భగవంతుని చిత్రాలను చిత్రించిన ఘనత రామకోటిదే
భగవంతుని సేవకు మించిన భాగ్యం మరొకటిలేదు
సిద్దిపేట జిల్లా నవంబర్ 11
కార్తీక సోమవారం సందర్బంగా మహా శివుని చిత్రాన్ని కర్బుజ కాయను ఉపయోగించి అత్య అద్భుతంగా మహా శివుని రూపాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి తన భక్తిని చాటుకున్నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు,
ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 30 సంవత్సరాలనుండి భగవంతుని చిత్రాలు ఇన్నో భక్తితో చిత్రించానన్నాడు. కార్తీక మాసం మించిన మాసం మరొకటిలేదన్నారు. కోటి పుణ్యాలఫలితం కార్తీక మాసం అని అందరు దీపారాధన చేయాలని కోరారు. శివ కేశవులకు సమానమైన మాసం కార్తీక మాసం అన్నారు.
