మల మూత్ర విసర్జన రహిత పట్టణం అవార్డు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు పొందిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్.
అందరి సహకారంతోనే అవార్డు కమిషనర్ విద్యాధర్ రావు
కేంద్రప్రభుత్వం ప్రతి నగరాన్ని బహిరంగ మలమూత్రవిసర్జన రహిత (ODF) నగరాలుగా మార్చుటకు ప్రతి సంవత్సరం పోటీ నిర్వహించి అక్కడ గల ప్రజా మరుగుదొడ్లలో (CT/PT) గల సదుపాయాలు,నిర్వహణ పై కేంద్ర బృందం ప్రత్యక్ష పరిశీలన ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుని నగరాలకు వారి సదుపాయాల స్థాయిలను బట్టి సర్టిఫికెట్స్ ప్రదానం చేస్తారు, దానిలో భాగంగా 2022-23 సంవత్సరంనకు గాను గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి ODF++ సర్టిఫికెట్ రావడం జరిగింది. ఈ సర్టిఫికెట్ ను గౌరవ మునిసిపల్ /ఐ టి మంత్రి వర్యులు KTR గారి చేతుల మీదుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ మరియు గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కమీషనర్ విద్యాదర్ రావు కి ప్రదానం చేయడం జరిగింది.