ప్రాంతీయం

మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం

124 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ విఆర్ఆర్ గార్డెన్ లో గురువారం మండల ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బిజెపి దుబ్బాక నియోజకవర్గ పాలక్ అంజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో ఈనెల 7 తేదీన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శక్తి కేంద్రం ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులతో వర్చువల్ గా మాట్లాడతారన్నారు. మండలంలోని శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం స్క్రీన్ అమర్చడం కోసం ఫంక్షన్ హాల్ ను పరిశీలించారు. మండల నాయకులు నియోజవర్గ పాలక్ అంజిరెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ చింత సంతోష్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కౌకూరి యాదగిరి, దుబ్బాక కన్వీనర్ ఏస్ ఏన్ చారి, మండల ఇంచార్జ్ రోశయ్య, బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, ఉపాధ్యక్షులు గడ్డమీది స్వామి, నాయకులు బిక్షపతి, భూపాల్ రెడ్డి రామస్వామి గౌడ్ మహేష్, స్వామి, బిక్షపతి, పోషయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7